వారితో స్నేహం అవసరమే!

0
74

సహోద్యోగులతో స్నేహం అవసరమే!

* ఇంటి పనుల విషయంలో కుటుంబసభ్యుల సహకారం తీసుకుంటాం కదా… అదే విధంగా విధుల్లోనూ తోటి మహిళల సహకారం తీసుకోవాలి. పనులు వేళకు పూర్తికావడమే కాదు… సహోద్యోగుల మధ్య సత్సంబంధాలు కూడా పెరుగుతాయి.
* సమస్యలు ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోవడం సహజమే. ధైర్యం కూడా సన్నగిల్లుతుంది. కానీ అలాంటి పరిస్థితుల్లోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ సమస్యల్ని ఎలా అధిగమించాలనేది ఆలోచించాలి. అంతేతప్ప కుంగిపోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.
* కొందరు ఉద్యోగినులు తాము సాధించిన విజయాలు చెప్పేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అవతలివాళ్లు అవి గొప్పలుగా భావిస్తారని అనుకుంటారు. కొన్నిసార్లు అలా చెప్పుకోవడం కూడా అవసరమే. దానివల్ల మీరేంటనేది అవతలివారికి తెలుస్తుంది. భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది.
* ప్రతికూల ఆలోచనలతో బాధపడుతూ తమ జీవితం అయిపోయిందని అనుకుంటారు చాలామంది. కానీ ప్రతికూల ఆలోచనల్ని కూడా అదుపులోకి తెచ్చుకోగలగాలి. దేన్నయినా సాధించొచ్చు అనే సానుకూల ధోరణిని పెంచుకోవాలి. అప్పుడే కష్టమైన పనైనా సరే… పూర్తి చేయగలుగుతారు.