ఉపశమనం కలిగించేందుకు తేలికైన, సులువైన ఎక్సర్‌సైజ్‌లు

0
42

కాళ్లను చాచి : పాదాన్ని నేలపై ఉంచి, మోకాలిని ముందుకు చాచాలి. తొడభాగం, మోకాలు భాగం స్ర్టెచ్‌ అయ్యేంత వరకూ శరీరాన్ని ముందుకు వంచాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రెండు కాళ్లతో ప్రతి మూడు లేదా అయిదు నిమిషాలకు ఒకసారి 30 సెకన్ల పాటు చేయాలి.
మోకాలిని ఛాతీకి: ఎడమ మోకాలిని రెండు చేతులతో పట్టుకొని మీ ఛాతీ భాగానికి సమీపంగా తీసుకువచ్చి, మోకాలిని ఛాతీకి ఆనించాలి. దీంతో మీ వెన్నెముక స్ర్టెచ్‌కు గురవుతుంది. తరువాత ఈ ఎక్సర్‌సైజ్‌ను కుడి మోకాలితో కూడా చేయాలి. ఇలా ప్రతి మూడు నుంచి అయిదు నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల సమయం చేస్తే, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.
తొడభాగం ముందుకు: మీ కుర్చీకి సమీపంగా నిల్చొని, ఎడమ పాదాన్ని సీటు వెనక భాగానికి ఆనించాలి. మోకాలిని మందుకు వంచి రెండో పాదాన్ని నేలపై ఉంచి, శరీరాన్ని ముందుకు కదిలించాలి. దీంతో తొడభాగం, తుంటిభాగాలు స్ర్టెచ్‌కు లోనవుతాయి. అయిదు నిమిషాలకొకసారి ఇలా చేస్తే కాళ్లు ఒత్తిడికి లోనవవు.
తలను మోకాళ్లకు ఆనించడం: ఈ పొజిషన్‌లో మీ చేతుల్ని తొడల వెనక ఉంచి తలను మోకాళ్లకు ఆనించాలి. దీంతో పొట్టభాగం స్ర్టెచ్‌ అవుతుంది. ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాలు చేయాలి.
పక్కకు శరీరాన్ని వంచడం: కుర్చీలో కూర్చొనే ఎడమ చేతిని మీ తలభాగం మీదకు ఎత్తిఉంచాలి. ఇప్పుడు కుడిచేతి వైపు శరీరాన్ని వంచాలి. కుడి చేతిని తలపైకి ఎత్తి ఉంచి, ఎడమ చేతివైపు వంగాలి. ఇలా అయిదు నిమిషాలకు ఒకసారి 15 లేదా 20 సెకన్ల పాటు చేయాలి.