జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) వచ్చే జూలై 7న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు www. ctet. nic. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష ఫీజును వచ్చే నెల 8వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించింది.
ఒక పేపరుకు దరఖాస్తు చేస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.350 పరీక్ష ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపింది. పేపరు–1, పేపరు–2 రెండు పరీక్షలు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.600 చెల్లించాలని పేర్కొంది.