మాటీవీలో ప్రసారం అయ్యే పవిత్రబంధం నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని సాయి అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు సేకరిస్తున్నారు. ఆమె భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు.
సూర్య అలియాస్ నానితో పరిచయం అయిన తర్వాత ఝాన్సీ సీరియల్స్ మానేసిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేయడం తో.. తనను మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఆత్మహత్యకు చేసుకుందని వెల్లడించారు. మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఝాన్సీని, ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.
ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడటాన్ని తోటి నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఝాన్సీ నిన్న కూడా పేరెంట్స్‌తో గొడవ పడినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు ఆమె సూర్యతో వాట్సాప్ చాట్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రేమ, పెళ్లి విషయాల్లో విఫలం ఐతే చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ప్రేమ, పెళ్లి జీవితం లో ఒక భాగమే కానీ ఇవే జీవితం కాదనే సత్యాన్ని మర్చిపోతున్నారు. ప్రేమ, సెక్స్, పెళ్లిలాంటి విషయాల గురించి పేరెంట్స్ కూడా పిల్లలతో ఓపెన్ గా డిస్కస్ చేయాలి. అలానే పిల్లలు డిప్రషన్ లో ఉన్నపుడు తల్లి తండ్రులు సపోర్ట్ సిస్టం గా ఉండాలి.