కివీస్ పండ్ల తో బొజ్జ ని తగ్గించుకోండి.

0
46

బొజ్జ తగ్గాలంటే..? బరువు తగ్గాలంటే… ముఖ్యంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా పొట్ట తగ్గుతుంది. ఇంకా సీజనల్ ఫుడ్స్ తీసుకుంటే.. బరువును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా వింటర్లో దొరికే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరడంతో పాటు బొజ్జ తగ్గుతుంది.

కివీస్ పండ్లు.. ఇవి వింటర్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్. వీటిల్లో విటమిన్లు పుష్కలంగా వుంటాయి. విటమిన్ సి, ఈ, ఫోలేట్, డైయటరీ ఫైబర్ వుంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ని నియంత్రించి.. బరువును తగ్గిస్తాయి. ద్రాక్ష, నారింజ పండును తీసుకుంటే బొజ్జను తగ్గించుకోవచ్చు. రక్తపోటును నియంత్రించుకోవచ్చు. వీటిల్లోని లో-కెలోరీలు బరువు తగ్గిస్తాయి. ఇంకా ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్లు ఒబిసిటీని దరిచేరనివ్వవు. అలాగే దానిమ్మ గింజలను రోజుకు రెండు కప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ పండు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. ముఖ్యంగా పొట్టను పెరగనివ్వదు. దానిమ్మ గింజలను తీసుకోవడం ద్వారా జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం వుండదు. దానిమ్మ గింజలను రోజుకు ఓ కప్పు తీసుకుంటే బరువు సులభంగా తగ్గొచ్చునని వైద్యులు సెలవిస్తున్నారు.