మంచి సినిమా ని అందించలేకపోయాం: రామ్ చరణ్

0
182

సుకుమార్ దర్శకత్వం లో ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన తర్వాత మెగా స్టార్ రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది అలానే గౌరవం కూడా దక్కింది.

తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా తో వస్తాడో అని ప్రేక్షకులు, సినిమా వాళ్ళు చాలా ఆసక్తి గా ఎదురు చూసారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్‌ అయ్యింది. ఈ సినిమాలో కొన్ని సీన్లను సోషల్ మీడియా లో జనాలు చాలా దారుణం గా ట్రోల్ చేశారు. లాజిక్ సంగతి పక్కన పెడితే అసలు మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

రంగస్థలం తర్వాత చరణ్ ఇలాంటి సినిమాను ఎలా ఒప్పుకున్నాడనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే రామ్ చరణ్ ఈ సినిమా ఫలితం పై స్పందింస్తూ ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు.

సినిమా ఫ్లాప్ అయినా కానీ సక్సెస్ మీట్ లు పెట్టుకుంటున్న ఈరోజుల్లో.. పరాజయాన్ని ధైర్యం గా ఒప్పుకున్నా రామ్ చరణ్ ఆటిట్యూడ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు.