“తిప్పరా మీసం” ఫస్ట్ లుక్

0
55

‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘మెంటల్ మదిలో’ ‘నీది నాది ఒకే కథ’ వంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు మరో డిఫరెంట్ సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందు కి రాబోతున్నాడు. ఆ సినిమా పేరే ‘తిప్పరా మీసం’. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘అసుర’ సినిమాను డైరెక్ట్ చేసిన కృష్ణ విజయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా తో నిక్కి తంబోలి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రిజ్వాన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా రిజల్ట్ ఏంటో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.