తనని ప్రేమించలేదనే కారణంతో భరత్ అనే వ్యక్తి తన స్నేహితురాలైన మధులికపై నడిరోడ్డు లో కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన మధులిక ని వెంటనే మలక్పేట యశోద ఆస్పత్రికి తరలించారు.
మధులికపై దాడి కేసులో నిందితుడు భరత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు బృందాలతో భరత్ ని పట్టుకున్నామని డీసీపీ రమేష్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు. ప్రేమను అంగీకరించలేదనే కారణం తోనే మధులికపై భరత్ దాడి చేశాడని రమేష్ రెడ్డి చెప్పారు. భరత్ ఇంటి దగ్గర్లోనే మధులిక ఇల్లు ఉందని, ఇంటికి దగ్గరలోనే (సత్యానగర్) మధులిక కాలేజీ కి వెళ్లే సమయం లోనే ఆమెను కొబ్బరి బోండాలు నరికే కత్తితో భరత్ మధులిక ని దాడి చేశాడని డీసీపీ తెలిపారు. ఆ కత్తి ని భరత్ ఇంటినుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తేలిపారు.
మధులిక స్పృహలోకి రావాలని, దానికోసం మెరుగైన ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నట్టు తెలిపారు. ఆమె స్పృహ లోకి రాగానే తనని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు. భరత్ ని మాత్రం కోర్ట్ లో ప్రొడ్యూస్ చేస్తున్నట్టు గా చెప్పారు.