టాలీవుడ్ సెన్సేషన్ “అర్జున్ రెడ్డి” సినిమా ని, హీరో విక్రమ్ కొడుకు “ధృవ్” తో.. డైరెక్టర్ బాల రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసందే కదా.కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ కూడా కూడా రిలీజ్ అయ్యి జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియా లో జనాలు రకరకాలుగా ట్రోల్ కూడా చేశారు. సరే, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే.. వర్మా (అర్జున్ రెడ్డి రీమేక్) నిర్మాణ సంస్థ (E4 Entertainment) ఓ నోట్ రిలీజ్ చేసింది. డైరెక్టర్ బాల తమకి అందించిన ఫస్ట్ కాపీ తో తాము సంతృప్తి చెందలేదని, అందుకు గాను సినిమా ని వేరే నటులు, టెక్నీషియన్స్ తో మళ్ళీ రీషూట్ చేయబోతున్నట్ట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జూన్ లో రిలీజ్ కి ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలిపింది.
కొన్ని సినిమా లని రీమేక్ చేయడానికి టచ్ చేయకూడదు. ఒరిజినల్ సినిమా సోల్ ని, లేదా ఒరిజినల్ డైరెక్టర్ మీటర్ ని పెట్టుకోకపోతే సినిమా షేప్ మారిపోయి విచిత్రమైన సినిమా బయటకువస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా విష్యయం లో అదే జరుగుంటదేమో. అందుకేనేమో హిందీ లో అర్జున్ రెడ్డి రీమేక్ ని సందీప్ వంగానే డైరెక్ట్ చేస్తున్నాడు.