తనని ప్రేమించలేదనే కారణంతో భరత్ అనే వ్యక్తి తన స్నేహితురాలైన మధులికపై నడిరోడ్డు లో కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయం పై హీరో మంచు మనోజ్ పై స్పందించారు.
“మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి? మనిషి అనే వాడు ఒక ఆడపిల్ల మీద దాడి చేసే ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తలుచుకుంటే ఇలాంటివి ఏ నాడు జరగవు…ఆడపిల్లల్ని రక్షించాల్సిన మగాడు ఆడపిల్ల అనుభవించే నరకానికి కారకుడు ఐతే ఇంక మనం పుట్టిన దానికి అర్ధం ఏమిటి?? #RespectWomen #ProtectWomen” అంటూ ట్వీట్ చేశారు.