బాబు మీద బయోపిక్..నిజమెంత ??

0
31

ఈ ఏడాది బయోపిక్ ల నామ సంవత్సరం గా మారింది అని చెప్పుకోవచ్చు. 2019 జనవరి లో “ఎన్టీఆర్” బయోపిక్, ఫిబ్రవరి లో “వై.యస్” బయోపిక్ రిలీజ్ అయ్యాయన్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు తాజా గా మరో బయోపిక్ రాబోతుంది.

 

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జీవిత కథ ఆధారంగా చిత్రీకరించిన ‘చంద్రోదయం’ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. మార్చి 10న చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత జీవీకే రాజేంద్ర అనౌన్స్ చేశారు.

బయోపిక్ లు వస్తున్నాయి కానీ వీటిలో ఎంత వరకు నిజా నిజాలు ఉన్నాయనేదాని మీద జనాలందరికీ సందేహమే. అందుకే పొలిటికల్ లీడర్స్ మీద వస్తున్న బయోపిక్ ల మీద అంత ఇంటరెస్ట్ కూడా చూపించట్లేదు జనాలు. “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమానే దానికి ఉదాహారణ. కానీ రామ్ గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” కోసం జనాలు చాలా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్టు చూపిస్తాడని ఓ నమ్మకం. ఇప్పటికే “వెన్నుపోటు” అనే సాంగ్ ని రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. సో, “బయోపిక్ ల యందు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ వేరయా” అన్నట్టుంది పరిస్థితి.