శ్రీ పంచమి రోజున ఇలా చేస్తే.. అదెప్పుడంటే?

0
50

ఫిబ్రవరి 10, 2019, ఆదివారం, మాఘ శుద్ధ పంచమి వస్తోంది. ఈ మాసములో శుక్లపక్ష పంచమిని వసంత పంచమి అంటారు. ఆ రోజున సరస్వతీదేవి జన్మదినముగా జరుపుతారు. దీనినే శ్రీపంచమి అని కూడా అంటారు. ఈరోజున పిల్లలకు అక్షరాభ్యాసములను జరుపుతారు.

ఇంకా ఈ రోజున ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించినా మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారాభివృద్ధికి, కొత్త ఉద్యోగాల్లో చేరేందుకు ఈ రోజు అనుకూలం. వ్యాపారాలను ఇదే రోజున ప్రారంభించడం.. శుభకార్యాలను చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వుంటాయి.

ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాది వారు. అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించటమే కాకుండా అందరు పసుపు రంగు బట్టలే కట్టుకుంటారట. ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమి అని కూడా అంటారు. రతి దేవి,కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట.