ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం: వైఎస్ జగన్

0
32

సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగించిందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో దాదాపు.. 59 లక్షల 18వేల దొంగ ఓట్లు ఉన్నాయని గవర్నర్ నరసింహన్ కు చెప్పారు. పోలీసు పదోన్నతుల విషయంలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.

ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టింది చంద్రబాబేనని.. ఆ తర్వాత బీజేపీపై మండిపడింది ఆయనేనని జగన్ విమర్శించారు. రాష్ట్రంలోని దొంగ ఓట్ల భాగోతాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు వివరించామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రంలో 59 లక్షల బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని వాటిని తొలగించాలని నరసింహన్‌ను కోరారు. సర్వేల పేరుతో టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఓట్లను తొలగిస్తున్నారని గవర్నర్‌‌కు ఫిర్యాదు చేశారు. ఓడిపోతామనే భయంతోనే అసలు ఓట్లను తొలగించి బోగస్ ఓట్లను నమోదు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇక పోలీసు శాఖను రాజకీయ స్వార్థం కోసం వినియోగిస్తున్నారని వైఎస్ జగన్ గవర్నర్‌కు చెప్పారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగ పరుస్తూ 5 వేల కోట్లను నియోజకవర్గాలకు తరలించారని మండిపడ్డారు. ప్రమోషన్లతో తనకు అనుకూలంగా వ్యవహరించేవారికే బాబు పెద్ద పీఠ పీట వేశారని గుర్తుచేశారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీతో సహా ఇంటలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర్ రావు, శాంతి భద్రతల డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. చంద్రబాబు ఢిల్లీ దీక్షను వైఎస్ జగన్ ఎద్దేవ చేశారు.

ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. బీజేపీతో నాలుగేళ్లు అధికారం పంచుకున్న చంద్రబాబు కానీ, టీడీపీ మంత్రులు కానీ ఏనాడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదన్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు నల్లచొక్కాలు వేసుకుని దీక్షలు చేస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. ఓటర్ల నమోదులో అవకతవకలు, సర్వేలో అక్రమాలతోపాటు డీజీపీని తప్పించాలని వైఎస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది.