వెంకటేశ్ కుమార్తె పెళ్లి ముహూర్తం ఫిక్స్

0
29

విక్టరీ వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో మార్చి 1న జరగనుంది. హైదరాబాద్ లో జరిగే వీరి పెళ్ళికి తెలుగు సినీ ప్రముఖులే కాకుండా ఇతర రంగాలకు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత నిశ్చితార్థం ఈ నెల 6న జరిగింది. ఆశ్రితది ప్రేమ వివాహమట తెలుస్తోంది. పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో పెళ్లి పనుల్లో వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నట్టు సమాచారం. కూతురి వివాహ వేడుక పూర్తయ్యాక ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ లో వెంకటేశ్ పాల్గొంటారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.