రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ విస్మరించిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే మహాకూటమితో ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రత్యేక భరోసా యాత్రను ప్రారంభించనుంది.
ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు.. ఆయన సోదరి ప్రియాంకా గాంధీకూడా హాజరవుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ యాత్ర ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభం కానుందని తెలిపారు.
అలాగే ఈ నెలాఖరు లోపు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంతో పాటు అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను కూడా తయారు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేశారని, నల్ల జెండాలతో ఆయన పర్యటనకు నిరసన తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.