పులిని కూడా నిమిషాల్లో నిద్రపుచ్చగలిగే సత్తా ఆమెది: విశాల్

0
64

పందెంకోడి హీరో విశాల్ ఓ ఇంటివాడు కానున్నాడు. మార్చి మొదటి వారంలో విశాల్, అనీశాల నిశ్చితార్థం అట్టహాసంగా హైదరాబాదులో జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆయనకు కాబోయే శ్రీమతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అనీశాకు తానే ముందు ప్రపోజ్ చేశానని తెలిపాడు. ఓ పులికి శిక్షణ ఇచ్చి దాన్ని నిమిషాల్లో నిద్రపుచ్చగల సత్తా, నైపుణ్యం ఆమెలో వుందని.. అలా నిద్రపుచ్చుతున్న వీడియోను చూసి తాన సర్‌ప్రైజ్ అయ్యానని చెప్పాడు.

ఆమెను దేవుడే తనకోసం పంపించాడని విశాల్ చెప్పుకొచ్చాడు. తాను వీధి శునకాల ఇతివృత్తంతో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని.. దీనికి సంబంధించిన స్క్రిప్టును అనీశాకు చదివి వినిపించానని.. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు విశాల్ వెల్లడించాడు.

ఇందులో విశేషం ఏమిటంటే.. ఈ సినిమా కోసం పనిచేస్తున్న క్రియేటివ్ బృందంలో అనీశా ఒకరని.. ఆమెను ఫీడ్‌బ్యాక్ కోరినట్టు తెలిపాడు. అనీశా జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణి.. అలాగే సోషల్ వర్కర్ కూడా అని విశాల్ పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలా? వద్దా? అనేది ఆమె ఇష్టమని.. తన చేతుల్లో ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.