మాఘమాసములో సముద్ర స్నానం చేస్తే?

0
41

మాఘమాసంలో చేసే పుణ్య స్నానం విశేష ఫలితాలను ఇస్తుంది. మాఘమాసములో చేసే స్నానం విశేష ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో అరుణోదయ కాలములో పుణ్య నదులలో కానీ, సరస్సులలో కానీ, తీర్థములలో కానీ, చివరకు ఇంటివద్ద కానీ స్నానం చేసి, నిత్యారాధనతో పాటు మాధవుడికి, సూర్యుడికి విశేష అర్ఘ్యములను ఇవ్వాలి.

చలికాలములో సూర్యకాంతి శరీరమునకు తగలక అనేక రుగ్మతలు వస్తాయి. మాఘమాసములో సూర్యకిరణములలో వేడి ఎక్కువ ఉండి అది నదులలోని నీటిలో ఉన్న బాక్టీరియాను చంపుట వలన ఆ నీరు మన శరీరమునకు మేలు చేస్తుంది.

అలాగే సముద్రజలములో ఉండే ఉప్పు యాంటీ-బయాటిక్ గా పనిచేస్తుంది. అందువలన ఈ మాఘమాసములో కనీసం ఒక ఘడియకాలం పాటు అంటే 24 నిమిషాల పాటు సముద్ర స్నానం చేయాలని.. సముద్ర జలము వద్ద గడపాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.