ఎండిన తమలపాకులను పొడి చేసి.. కొబ్బరినూనెతో కలిపి..?

0
44

ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా వంద గ్రాములు కలుపుకోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్ కలిసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది.

రాత్రి పడుకునే ముందు కొంచెం నీళ్లలో చపాతీని నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని పేస్ట్‌లాగా చేసి ముఖానికి పట్టించండి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి.

కుంకుమపువ్వును పొడి చేసి దానికి కొంత తేనె కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్ తొందరగా మాయమవుతాయి.

మచ్చలను తొలగించడంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లరసాలకు మించింది లేదు. కొంచెం నిమ్మరసాన్ని కాటన్‌తో తీసుకుని నల్లటి మచ్చలపై రాసి సుతిమెత్తగా మసాజ్ చేయాలి. దీనిలో ఉన్న విటమిన్-సి మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది.

కొంచెం దూదిపై పాలు లేదా మజ్జిగ చుక్కలు వేసి దాన్ని మచ్చలున్న ప్రాంతంపై రాసుకోండి. వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.

మొటిమలు తాలూకు మచ్చలను తొలగించాలంటే… తేనెను వినియోగించాలి. తేనెలో ఎన్నో చక్కటి ఔషధ గుణాలున్నాయి. అవి నల్లమచ్చలను తొలగించడంలో తోడ్పడతాయి.