మూడంటే మూడు నిమిషాల్లో విడాకులు.. కాలుజారిపడిందని?

0
45

వినేందుకు వింతగా వుంటుంది. అయినా ఇది నిజం. కువైట్‌లో వధువు కాలుజారి కిందపడిందనే కారణంతో పెళ్లైన మూడంటే మూడు నిమిషాలకు ఓ వరుడు విడాకులు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కువైట్‌లో వధూవరులు.. తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కోర్టు నుంటచి బయటకు వస్తూ వస్తూ.. వధువు పొరపాటున కాలు జారి కిందపడింది.

పక్కనే వున్న వరుడు వధువుకు సాయం చేయాల్సిందిపోయి.. కింద పడి పరువు తీసిందంటూ.. పరుష పదానికి దిగాడు. అంతేగాకుండా పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు తీసుకున్నాడు. వధువు కిందపడిన వెంటనే ఆమె విడాకులు కావాలని అడగడం… అందుకు జడ్జి కూడా విడాకులను మంజూరు చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. కువైట్‌ చరిత్రలో అతి తక్కువ వ్యవధిలో విడాకులు తీసుకున్న జంట వీరిదేనని స్థానిక మీడియా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.

కాగా, గతంలో దుబాయ్ లో ఓ జంట పెళ్లియన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది. ఇక, ప్రపంచంలో పెళ్లయిన అతి కొద్ది సమయంలోనే విడాకులు తీసుకున్న జంట కూడా ఇదేనని చెప్పుకుంటున్నారు.