మళ్ళీ బాలయ్య తో బోయపాటి సినిమా ??

0
176

వినయ విధేయ రామ సినిమా డిసాస్టర్ తర్వాత బోయపాటి కి, ప్రొడ్యూసర్ దానయ్య కి మధ్య గొడవ జరిగిందనే వార్త ఈ మధ్య టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇది పక్కన పెడితే దర్శకుడు బోయపాటి తో సినిమా తీయడానికి నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఐతే బోయపాటి తన తరువాత సినిమా నందమూరి బాలకృష్ణ తో ఉండబోతుందని ఫిలింనగర్ టాక్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

దీంతో బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌ పై మళ్లీ ఓ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ఆశించిన విజయం సాధిస్తే అటు బోయపాటి ఇటు బాలయ్య..ఇద్దరూ ట్రాక్ లోకి వచ్చినట్లే. ఎందుకంటే బాలయ్య కూడా “ఎన్టీఆర్ కథానాయకుడు” కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమా ని తీసుకోవడం లో డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నారట. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య కి కూడా హిట్ అవసరమే. మరి వీరి కాంబినేషన్ లో వచ్చే ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే.