హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో ట్వంటీ-20లో భారత్ పరాజయం పాలైంది. ఇప్పటికే 1-1తో సిరీస్‌ను సమం చేసిన భారత్… ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌ను గెలిచిన తొలి దేశంగా అవతరిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ రోహిత్ సారథ్యంలోని భారత జట్టు కివీస్ చేతిలో చివరి టీ-20లో పరాజయం పాలైంది.
హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. తద్వారా మూడు టీ-20ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (38), విజయ్ శంకర్ 43, రిషభ్ పంత్ 28, హార్దిక్ పాండ్యా 21 మోస్తరుగా రాణించినా.. భారత్‌కు పరాజయం తప్పలేదు.
చివర్లో దినేష్ కార్తీక్ 16 బంతుల్లో 33 పరుగులు (4 సిక్సర్లు), కృణాల్ పాండ్యా 13 బంతుల్లో 26 పరుగుల (2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో చెలరేగిపోయారు. చివరి బంతిని కార్తీక్ సిక్సర్ గా మలిచాడు. ఇంకో బంతి మిగిలి ఉంటే భారత్ గెలిచేదేమో. కివీస్ బౌలర్లలో శాంట్నర్, మిచెల్ లు చెరో 2 వికెట్లు తీయగా… కుగ్లీన్, టిక్నర్ లు చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ ఓపెనర్లు మన్రో 72, సీఫ్రెట్ 43 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
భారత బౌలర్లలో కుల్డీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా… భువనేశ్వర్, అహ్మద్‌లు చెరో వికెట్ తీశారు. 72 పరుగులు చేసిన కివీస్ బ్యాట్స్ మెన్ మన్రోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సీఫ్రెట్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.