దినేష్ కార్తీక్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

0
61

హామిల్టన్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. రెండు దేశాల్లో మూడు నెలల సుదీర్ఘ పర్యటనను విజయంతో టీమిండియా ముగించాలనుకుంది. అయితే ఆస్ట్రేలియాలో టెస్టులు, ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలిచిన టీమిండియా ట్వంటీ-20 సిరీస్‌ని డ్రా చేసుకుంది. తర్వాత కివీస్‌తో వన్డే సిరీస్‌ను 4-1తో నెగ్గింది. చివరిగా మిగిలిన టీ-20ని చేజార్చుకుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా హామిల్టన్ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెటిజన్స్ దినేష్ కార్తీక్‌పై ఫైర్ అవుతున్నారు. చివరి ఓవర్లో భారత్‌కు 16 పరుగులు అవసరం కాగా మొదటి బంతికి డబుల్‌ తీసిన కార్తీక్‌ తర్వాతి బంతికి పరుగు చేయలేదు. మూడో బంతికి సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా కార్తీక్‌ అందుకు నిరాకరించాడు.

అవతలి ఎండ్‌లో ఉన్న కృనాల్‌ పాండ్యా సింగిల్‌ కోసం ప్రయత్నించగా అతడిని రావొద్దన్నాడు. తర్వాత నాలుగు, ఐదు బంతులకు చెరో సింగిల్‌ తీయడంతో చివరి బంతికి 11 పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతికి కార్తీక్‌ భారీ సిక్స్‌ బాదినా టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోలేదు. కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

మూడో బంతికి దినేశ్‌ కార్తీక్‌ పరుగుకు నిరాకరించడంతో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గౌతంగంభీర్‌ దినేశ్‌ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. అవతలి ఎండ్‌లో ఉన్నది కృనాల్‌ పాండ్యా.. అతడు టెయిలెండర్‌ కాదు అప్పటికే ధాటిగా ఆడుతున్నాడని అసహనం వ్యక్తం చేశాడు. గతంలో ఆస్ట్రేలియా టూరు 2012లో ధోని ఇలాగే ధోనీ సింగిల్‌ను నిరాకరించి రెండు బంతులు మిగులుండగానే జట్టును గెలిపించాడు. ఈ ఘటనను గుర్తు చేసుకొని నెటిజెన్లు దినేశ్‌ కార్తీక్‌పై ట్వటర్‌లో మండిపడుతున్నారు. నువ్వేమైనా ధోనీ అనుకున్నావా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.