టీవీ నటి “ఝాన్సీ” బాయ్ ఫ్రెండ్ ని విచారిస్తున్న పోలీసులు

0
35

మాటీవీలో ప్రసారం అయ్యే “పవిత్రబంధం” నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డారన్న విషయం తెలిసిందే.
సూర్య అలియాస్ నాని అనే వ్యక్తి తనని ప్రేమించి మోసం చేసాడనే ఆవేదనతోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఆత్మహత్యకు చేసుకుందని ఝాన్సీ తల్లి వెల్లడించింది.

ఝాన్సీ కాల్స్ డేటా ని, వాట్సాఫ్ మెసేజ్‌ల వివరాలను, మరియు ఝాన్సీ డైరీ వంటి పలు కీలక విషయాలు పోలీసులు సేకరించి… సూర్యతేజాచౌదరిని పోలీసులు ఆదివారం విచారించారు.

సూర్యతేజాచౌదరిని ఇంకా అరెస్ట్ చేయలేదని, కేవలం కస్టడీ లోకి తీసుకొని విచారిస్తున్నట్టు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ బి. మోహన్ కుమార్ తెలిపారు.