ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విజ‌య బాపినీడు కన్నుమూత‌

0
114

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విజ‌య బాపినీడు అనారోగ్యంతో క‌న్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యవ్వనం కాటేసింది’ సినిమాను నిర్మించిన ఆయ‌న ‘డబ్బు డబ్బు డబ్బు’ సినిమాతో దర్శకుడి గా మారారు. బాపినీడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. చిరంజీవితో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘మగధీరుడు’, ‘గ్యాంగ్ లీడర్’, ‘బిగ్ బాస్’, ‘ఖైదీ నంబర్ 786’ వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్ తో కూడా కలిసి ఎక్కువ సినిమాలకి పని చేశారు.

విజయ బాపినీడు అస‌లు పేరు గుత్తా బాపినీడు చౌదరి కాగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న విజ‌య బాపినీడుగా సుప‌రిచితం.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విజయ బాపినీడు రూపొందించిన చిత్రాలు ఇవే

1. యవ్వనం కాటేసింది (1976)
2. డబ్బు డబ్బు డబ్బు (1982)
3. పట్నం వచ్చిన పతివ్రతలు
4. మగమహారాజు (1983)
5. హీరో (1984)
6. భార్యమణి (1984)
7. మహారాజు (1985)
8. కృష్ణగారడి (1985)
9. దొంగల్లో దొర
10. మగధీరుడు (1986) \
11. నాకు పెళ్లాం కావాలి (1987)
12. ఖైదీ నంబర్ 786 (1988)
13. దొంగకోళ్లు (1988)
14. మహరాజశ్రీ మాయగాడు (1988)
15. సుమంగళి (1989)
16. జూ లకటక (1989)
17. మహాజనానికి మరదలు పిల్ల (1989)
18. గ్యాంగ్ లీడర్ (1990)
19. వాలు జడ తోలు బెల్టు (1991)
20. సీతాపతి చలో తిరుపతి (1992)
21. బిగ్‌బాస్ (1995)
22. ఫ్యామిలీ (1996)
23. కొడుకులు (1998)