బాసుంది తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… తయారీ విధానం

0
55
basundi
benefits of basundi and Quick and Delicious Basundi Recipe

బాసుంది అనేది స్వీటే కదా ఇందులో పెద్దగా ఆరోగ్య ప్రయోజనాలు ఏముంటాయ్ అనుకుంటున్నారు కదూ.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. వారానికి రెండు సార్లు తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు ఇది పుష్టికరమైన వంటకం.. ఇంకా శక్తిని ఇస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. మృదువైన కోమలమైన చర్మాన్నిస్తుంది. పాల ఉత్పత్తులతో చేసే ఈ వంటకాన్ని తీసుకోవడం ద్వారా క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ప్రోటీన్లు, కేలరీలుండే ఈ బాసుందిని ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు
చిక్కగా బాగా మరిగించిన పాలు-రెండు లీటర్లు
పంచదార – అర కేజీ
ఏలకుల పొడి – ఒకటిన్నర స్పూన్
జీడిపప్పు, బాదం, పిస్తా – ఒక కప్పు

తయారీ విధానం :
ముందుగా పాలను ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని సన్నని సెగపై మీగడ కట్టేవరకు మరిగించాలి. ఆ మీగడను ఒక గిన్నెలోకి తీసుకుంటూ వుండాలి. అలా రెండు లీటర్ల పాలు అర లీటర్ అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత ఆ పాలను దించి మీగడను ఆ పాలలోనే కలిపి.. యాలకుల పొడి, పంచదార, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో వుంచి గంట తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.