శిఖా చౌదరికి మద్దతుగా శ్రీరెడ్డి

0
44

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు విషయంలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ మధ్యనే ఈ హత్య కేసులో శిఖా చౌదరి ని, ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసుల కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సంచలనం రేపిన ఈ చిగురుపాటి జయరాం హత్య కేసు లోకి శిఖా చౌదరి ని లాగడం పై నటి శ్రీరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య కేసులో శిఖా చౌదరి తప్పేమి లేదని, నిజా నిజాలు తెలుసుకోకుండా ఆమెని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదంటూ తన ఫేస్బుక్ అకౌంట్ నుండి కామెంట్ పెట్టింది.

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో సంచలనం రేపిన ఈ నటి హైదరాబాద్ వదిలి చెన్నైకి వెళ్ళిపోయింది. కొంతకాలంగా అక్కడే ఇళ్లు తీసుకుని ఉంటున్న శ్రీరెడ్డి.. సడన్‌గా హైదరాబాద్‌కి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రాగానే శిఖా చౌదరికి మద్దతుగా నిలిచి హాట్ టాపిక్ అయ్యింది శ్రీరెడ్డి.