ఇపుడు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై ఆధారపడుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులే కాదు చివరకు తినే ఆహారాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. ఇలా ఆర్డరిచ్చి తెప్పించుకునే ఆహారంలో బల్లులు, బొద్దింకలు, కోడి ఈకలు, రక్తం బ్యాండేజ్‌లు ఇలా రకరకాల వస్తువులు కనిపిస్తున్నాయి.
తాజాగా, హైదరాబాద్ సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన రవి తన కుమార్తె కోసం బిర్యానీ ఆర్డర్ చేశాడు. జొమాటో డెలివరీ బాయ్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చాడు. దాన్ని విప్పి చూడగా కుళ్లిపోయి ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావని డెలివరీ బాయ్‌ని రవి అడగగా.. జిప్సీ ఫుడ్ నుంచి అని సమాధానం చెప్పాడు.
దీంతో వినియోగదారుడు షాక్‌కు గురై నేరుగా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి.. తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జిప్సీ ఫుడ్ ఈ చర్యకు పాల్పడినట్టు నిర్ధారించి రూ.10 వేల అపరాధం విధించారు.