రాహుల్ కి ముద్దిచ్చిన ఓ మహిళ

0
30

ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ మహిళ ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. గుజరాత్‌లో జరిగిన ఎన్నికల సభలో ఈ సంఘటన జరిగింది.

పార్టీ ప్రచారం కోసం గుజరాత్ రాష్ట్రంలో వల్సద్‌ జిల్లాలోని లాల్‌దుంగ్రీ గ్రామంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది.
ఈ నేపధ్యం లో రాహుల్ గాంధీ ని కలవడానికి కొందరు మహిళలు వేదికపై వచ్చారు. వారితో మాట్లాడడానికి ఆయన లేచి నిలబడగా ఓ మహిళ ఆత్మీయతతో వచ్చి రాహుల్‌కు ముద్దు పెట్టేసింది. రాహుల్ చిరునవ్వుతో ఆమెను ఆప్యాయంగా పలకరించారు. తర్వాత మహిళలంతా కలిసి రాహుల్‌కు పూలదండలు వేసి.. కొద్దిసేపు ముచ్చటించారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి జనాలు గట్టిగా చప్పట్లు కొట్టారు.