తమిళ టీవీ నటి యషిక చెన్నైలోని వడపళనిలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ప్రియుడే కారణమని, అతడిని వదలొద్దంటూ తల్లికి వాట్సాప్‌లో మెసేజ్ చేసింది.
గతంలో వడపళనిలోని ఓ హాస్టల్లో ఉండే యషిక పెరంబూరుకు చెందిన అరవింద్ అలియాస్ మోహన్‌బాబు అనే వ్యక్తి తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఐతే గత కొద్ది కాలం గా వీళ్ళ మధ్య మనస్పర్థలు తలెత్తడం తో తీవ్ర మనస్ధాపానికి చెందిన నటి యషిక ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.
ఐతే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. రిలేషన్ లో తలెత్తిన సమస్యల వలనే యషిక సూసైడ్ చేసుకుందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారి లో ఉన్న మోహన్‌బాబు ని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.