తీవ్ర మనస్తాపానికి గురైన కేసీఆర్.. పుట్టినరోజు వేడుకలు రద్దు

0
26

కశ్మీర్‌లోని పుల్వామాలోని అవంతిపొర ప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 14) మధ్యాహ్నం సీఆర్‌పీఎఫ్ కాన్వాప్‌పై ఉగ్రదాడి జరిగిందన్న విషయం తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు.

అంతే కాదు…కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని, కావున ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరపవద్దని పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను సీఎం అభ్యర్థించారు.