ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

0
59

ఒక్క సారిగా గొంతు మూగబోయింది. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అమరుల కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఉగ్రవాద దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

దేశం కోసం తమను వదిలి వెళ్లిన వారు ఎప్పుడు తిరిగివస్తారా అని కొడుకు కోసం తల్లిదండ్రులు, భర్త కోసం ఓ భార్య.. ఇలా అందరూ తమ వారి కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ఒక్కసారిగా ఉగ్రమూకలు వారి కలల్ని కూల్చివేశాయి. దిగమింగుకోలేనంత కన్నీటిని మిగిల్చాయి. తిరిగి వస్తాడనుకున్న తమ బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళిపోయాడని తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

భారత మాత కోసం ఒక కొడుకు వీర మరణం పొందాడు. మరో కొడుకును కూడా దేశ సేవకే అంకితం చేస్తానని ఆ తండ్రి చెబుతున్నాడు. కొడుకు చనిపోయిన అతడు గుండె ధైర్యం మాత్రం కోల్పోలేదు. బీహర్‌లోని బాగల్పూర్‌కు చెందిన CRPF జవాన్ రతన్ కుమార్ ఉగ్రవాద దాడిలో మరణించారు. ఎట్టి పరిస్థతుల్లో పాకిస్థాన్‌కు మాత్రం తగిన గుణపాఠం చెప్పాలని వీరజవాన్ రతన్ కుమార్ తండ్రి డిమాండ్ చేశారు.

చివరిగా కొడుకుతో ఫోన్లో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారంటూ ఆవేదన చెందుతున్నారు. దాడికి సహకరించిన వారిని
కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు ఉన్న ఒక్క కొడుకు వీరమరణం పొందాడు. ఇప్పుడు తాను ఎవరికోసం బతకాలంటూ ఆ తండ్రి గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. తనకు దిక్కెవరంటూ బోరున విలపిస్తున్నాడు. దాడికి పాల్పడిన వారిని, దాడి వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని అమరుల కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు.