దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు: ఆర్జీవీ

0
30

ఒక పక్క “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమా ఘోరం గా ఫ్లాప్ అయితే..ఇంకో పక్క సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ దూసుకెళ్ళిపోతోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితంపై రామ్ గోపాల్ వర్మ తీస్తున్న”లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వర్మ నిన్న ఉదయం రిలీజ్ చేశారు. వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లో 40 లక్షల మంది కి పైగా చూసారు. ఈ సందర్భం గా వర్మ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

‘కేవలం 24 గంటల్లో లక్ష్మీస్ ‘ఎన్టీఆర్ ట్రైలర్’ ను 40 లక్షల మంది చూసారు. దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదిస్తున్నారు. ఎన్టీఆర్ కి చాలా థాంక్స్’ అంటూ తమ ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేశారు.