చంద్రబాబు భలే సినిమా తీసాడు: వై.యస్. జగన్

0
60

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు నెలల ముందు…మూడు నెలల కోసమని సినిమా తీసాడని వై.యస్. జగన్ సెటైర్స్ వేశారు.

“గతం లో పవన్ కళ్యాణ్, బీజేపీ ల తో చేతులు కలిపి రాష్ట్రాన్ని ముంచేసి…ఇప్పుడేమో వాళ్లతో పోరాడుతున్నట్టు డ్రామాలు ఆడతాడు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండానే జాతికి అంకితం చేసేస్తారు. రాజధాని కట్టకుండా కడుతున్నట్టు బిల్డప్ ఇస్తాడు. రాజధాని ఏది అని అడిగితే బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తాడు. గత ఐదేళ్లుగా రైతులకు ఇవ్వాల్సింది చంద్రబాబు ఏదీ ఇవ్వలేదు. కానీ, ఎన్నికలు వస్తుండడంతో ఆరో బడ్జెట్‌ ప్రవేశపెట్టాడు. తనకు అధికారం లేని బడ్జెట్‌. రూ.5 వేల కోట్లతో రైతు సుఖీభవ అంటూ చెవుల్లో పూలు పెడుతున్నాడు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. నాలుగో విడత, ఐదో విడత కింద చంద్రబాబు ఇచ్చిన చెక్కులన్నే బౌన్స్ అవుతున్నాయి.” అంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.