లక్ష్మీస్ ఎన్టీఆర్… హానెస్ట్ సినిమా

0
39

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంభందించిన ట్రైలర్ సంచలనం సృష్టిస్తుంది. ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ని ఇప్పటికే కోటి మందికి పైగా చూసారు. “నందమూరి తారకరామారావు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.” అని ట్వీట్ కూడా చేశారు.

రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఓ పోలింగ్ స్టార్ట్ చేశారు. బాలకృష్ణ “మహానాయకుడు”, “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాల్లో ఏది హానెస్ట్ సినిమా అంటూ ఒక పోల్ పెట్టారు. దీనికి జనాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకే ఓటు వేశారు.  

 

నిజానిజాలు పక్కన పెట్టి కేవలం “ఎన్టీఆర్” ని ఒక యుగ పురుషుడి గా…మహానుభావుడి గా ప్రోజెక్ట్ చేస్తున్న మహానాయకుడి సినిమా పై జనాలు ఆసక్తి చూపించట్లేదు. ఆ విషయం కథానాయకుడు అట్టర్ ఫ్లాప్ తోనే అర్ధం అయ్యింది. ఏదేమైనా..జనాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా పై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లెక్కన వర్మ తీసే ఎన్టీఆర్ బయోపిక్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.