ఆడవాళ్లు వేసుకునే డ్రెస్సులు బట్టి కేరెక్టర్ ఉంటుందా ?: నాగబాబు

0
123

ఆడవాళ్ళ వస్త్రధారణ పై కామెంట్ చేస్తున్నవాళ్లపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండియాలో ఆడవాళ్లకు గౌరవం లేదని, ప్రతీ మగాడూ ఆడదాన్ని అణగదొక్కాలనే చూస్తాడు అని అన్నారు.

” మహిళల వస్త్రధారణపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మురళీమోహన్, గరికపాటి లాంటి వాళ్లు ఎన్నో కామెంట్లు చేశారు. ఓ మహిళను మనతో సమానంగా చూసుకోలేనప్పుడు ఆమెను మనం గౌరవించలేం. ఓ హీరోయిన్ కాస్త ఎక్స్‌పోజింగ్ చేస్తూ డ్రెస్ వేసుకుంటే ఆ మాత్రం దానికే ఆమె ప్రొడ్యూసర్లు, హీరోలను ట్రాప్ చేసేస్తుందని ఎలా అంటారు. వాళ్లకి అడవాళ్లంటే అసలు గౌరవం ఉందా ? హీరోయిన్లేమైనా బట్టలిప్పుకుని వస్తున్నారా ? పొట్టి డ్రెస్సులు వేసుకునే దాని బట్టి కేరెక్టర్ ని ఎలా జడ్జి చేస్తారు ?? ” అంటూ గట్టిగా ప్రశ్నించారు.