బీసీ గర్జన సభ.. జగన్ వరాల జల్లు

0
33

ఏలూరులో జరిగిన బీసీ గర్జన మహాసభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు వరాల జల్లు కురిపించారు.

బీసీ గర్జన సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు నుంచి మూడున్నర లక్షల మంది అభిమానులు, బీసీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

ప్ర‌జాశీస్సుల‌తో అధికారంలోకి రాగానే జ‌గ‌న్ ఏపీ బీసీల‌కు ఏమి చేస్తారో చెప్పారు.

” బీసీల సంక్షేమానికి ఏటా రూ 15 వేల కోట్లు వెచ్చిస్తాం,

5 ఏళ్ల‌లో రూ 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం,

బీసీ స‌బ్ ప్లానుకు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పిస్తాం, మొద‌టి బ‌డ్జెట్ లో స‌మ‌గ్ర బీసీ చ‌ట్టాన్ని తీసుకుని వ‌స్తాం,

మూడో వంతు నిధులు బీసీల‌కు కేటాయిస్తాం, కార్పొరేష‌న్ల వ్య‌వ‌వ్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తాం, అన్ని కులాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తాం.

నా ర‌జ‌కులు, చేనేత, మ‌త్స్య‌కారులు, బోయ‌లు, వాల్మీకులు, అగ్రికుల‌ క్ష‌త్రియులు, శాలివాహ‌న,. దూదేకుల కొ్పుల వెల‌మ, శెట్టి బ‌లిజ‌, గాండ్ల, ముదిరాజ్ భ‌ట్రాజు వంటి బీసీ కులాల‌కు మొత్తం 139 కార్పొరేష‌న్లు ప్రారంభిస్తాం.

ఏ ఒక్క సామాజిక వ‌ర్గాన్ని నిర‌ర్ల‌క్ష్యం చేయ‌బోము

పార‌ద‌ర్జ‌వ‌కంగా ప్ర‌తి అక్క‌కు 45-60 ఏళ్ల వ‌య‌సు మ‌హిళ‌ల‌కు

రూ 75 వేలు చేయూత ప‌థ‌కంకింది నాలుగు విడ‌త‌ల కింద ఉచితంగా ఇస్తాం

బీసీ విద్యార్తుల విద్య కోసం రూ 20 వేలు

బీసీ పిల్ల‌ల‌ను బ‌డికి పంపితే ఏటా 15 వేలు ఇస్తాం

క‌మిటి, నివేదిక లేకుండా 32 కులాల‌ను మోస్ట్ బీసీలుగా గుర్తించారు

మా ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే బీసీ క‌మిష‌న్ ఏర్పాటు

కాల‌ప‌రిమితి నిరంత‌రం ప‌ని చేసేలా ప‌రిధిని విస్త‌రిస్తాం.

శాశ్విత ప్రాతిప‌దిక‌పై బీసీ క‌మిష‌న్ ఉంటుంది.

స‌ర్టిపికెట్లు, కులాల కెట‌గ‌రీల మార్పు గురించి ఈ క‌మిష‌న్ ప‌ని చేస్తుంది.

హేతుబ‌ద్ధంగా బీసీ క‌మిష‌న్ ప‌ని చేస్తుంది

రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు దూరంగా ఉండి ప‌ని చేసే క‌మిష‌న్ ఇది

బీసీ క‌మిష‌న్ పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తుంది.

బీసీ క‌మిష‌న్ సిఫార్సుల‌ను అమలు చేస్తాం

ఎస్సీ, ఎస్టీలుగా మార్చే విష‌యాల‌ను సీరియ‌స్‌గా తీసుకుంటాం.

అసెంబ్లీ కూడా తీర్మానాలు చేసి కేంద్ర అనుమ‌తికి పంపుతాం.

బీసీ ఓట్ల కోసం ఈ విష‌యాల‌ను మీముందు చెబుతున్నా నిజాయితీగా

31 బీసీలు ఓబీసీ కెట‌గ‌రీలో లేనందున ఉద్యోగావ‌కాశాలు కోల్పోతున్నారు

నాలుగు సంవ‌త్స‌రాలు బీజేపీతో అంట కాగిన చంద్ర‌బాబు ఇప్ప‌టి దాకా గాడిద‌లు కాశారా?

ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రాలేదు? ఎందుకు లేఖ రాయ‌లేదు?

తెలంగాణ‌లో బీసీ జాబితాల నుంచి తొల‌గించిన 32 బీసీల‌ను తిరిగి బీసీలుగా గుర్తించేలా ఒత్తిడి తెస్తాం.

హ‌రికృష్ణ శ‌వాన్ని ప‌క్క‌న పెట్టుకొని కేటీఆర్‌తో పొత్తు గురించి చంద్ర‌బాబు మాట్లాడుతారు కానీ బీసీల ఊసెత్త‌రు

తెలంగాణ బీసీల గురించి కేసీఆర్‌తో మాట్లాడుతా

ప్ర‌యివేటు కాంంట్రాక్టు ప‌నులు.. అవుట్ సోర్సింగ్ ప‌నులు..

50 శాతం ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు, బీసీల‌కే వ‌ర్తిచేలా కొత్త చ‌ట్టం

బీసీ కుల వృత్తిదారులు.. చిరువ్యాపారుల‌కు ..గుర్తింపు కార్డులిచ్చి ..

ఎపుడు అవ‌స‌రం అయితే అపుడు వారికి సున్నా వ‌డ్డీకే రూ ప‌ది వేలు రుణం

బీసీ రాజ‌కీయంగా బ‌ల‌ప‌డ‌టానికి అన్ని నామినేటెడ్ ప‌ద‌వులు..అన్ని నియామ‌కాల‌కు ..

ఈ క‌మిటీల‌లో 50 శ‌తం ఎస్సీఎస్‌టీ మైనానిటీ బీసీల‌కే ప్రాతినిద్యం

నామినేటెడ్ ప‌నుల‌లో కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లు బ‌ల‌హీన‌వ‌ర్గాలు, బీసీల‌కే

నాయీ బ్రాహ్మ‌ణుల దుకాణాల‌కు ఏటా రూ ప‌ది వేలు సాయం

సంచార జాతుల‌కు ఉచితంగా ఇళ్లే కాదు ఉపాధి స‌దుపాయం క‌ల్పిస్తాం.

ప్ర‌త్యేక గురుకుల పాఠ‌శాలలు ఏర్పాటు చేస్తాం

వేట నిషేధ‌ స‌మ‌యంలో మ‌త్స్య‌కారుల‌కు రూ 10 వేల ఇస్తాం

వేట‌కు వెళ్ళి చ‌నిపోతే రూ ప‌ది ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం

చేనేత‌ల‌కు నెల నెలా రూ రెండు వేల పెట్టుబ‌డి కింద ఇస్తాం

యాద‌వుల గొర్రెలు, మేక‌లు చ‌నిపోతే రూ ఆరు వేలు ఇస్తాం.

బ్రాహ్మ‌ణుల‌కు క‌నీ స వేత‌నం క‌ల్పిస్తాం.

దేవాల‌యాల ట్ర‌స్టీలుగా యాద‌వులు, నాయీ బ్రాహ్మ‌ణుల‌ను నియ‌మిస్తాం.

పేద‌లు ఆత్మ‌హ‌త్య‌ అకాల మ‌ర‌ణం చెందినా ..ఎస్సీ,ఎస్టీ, బీసీ, కావ‌చ్చు

వారింద‌రికీ బీమా ప‌థ‌కం కింద 7 ల‌క్ష‌లు ఇస్తాం

ఈడబ్బును ఆడ‌ప‌డుచు క‌ట్నం కింద ఇస్తున్నాం

అందుకు ఓ కొత్త చ‌ట్టం తీసుకుని వ‌స్తాం.

బీసీల‌ను వెన్నెముక‌గా తీర్చి దిద్దుతాం

ఒక సారి అధికారం ఇస్తే మీకు మంచి చేస్తా..” వెనుకబడిన వర్గాలపై జగన్ వరాల జల్లు కురిపించారు.