బాలీవుడ్ లో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘గల్లీ బాయ్’ సినిమా సూపర్ హిట్ అయ్యి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తోంది. ఈ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు రీమేక్ హక్కులు కొని, సాయి ధరమ్ తేజ తో చేయడానికి ప్రయత్నిస్తున్నారట. నిజానికి సాయిధరమ్ తేజ కి సరైన హిట్ పడి చాలా కాలం అయ్యింది. వరుస ఫ్లాప్స్ పడటం వలన సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పూర్తి గా పడిపోయింది. దీంతో సాయి ధరమ్ తేజ్ ని ఎలాగన్నా గట్టెక్కించాలనే ప్రయత్నం లో అల్లు అరవింద్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే.. “గీత గోవిందం” దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ ని హీరో గా పెట్టి సినిమా తీయాలనే ప్రపోసల్ కూడా జరుగుతుందని ఫిలింనగర్ సమాచారం.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ ‘చిత్రలహరి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో ఓ ఆసక్తి ఐతే ఉంది. దీనికి కారణం దర్శకుడు కిశోర్ తిరుమల. ఈయన గతంలో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సున్నితమైన చిత్రాలను తీశారు. చిత్రలహరి కచ్చితంగా తనకి బ్రేక్ ఇస్తుందని సాయి ధరమ్ గట్టిగా నమ్ముతున్నారు. వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న తేజూకు ‘చిత్రలహరి’ కలిసొస్తుందో లేదో.