ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. అవినీతి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచ రికార్డును సృష్టించారని కామెంట్ చేశారు.
ఈ రోజు తమ ట్విట్టర్ అకౌంట్ నుండి స్పందిస్తూ “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనడానికి 500 కోట్లు వెదజల్లాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కరిస్తుంటే 1,000 కోట్లు ఆశచూపుతున్నారు. తండ్రి కొడుకులు నాలుగు చేతులతో దోచుకున్నారు. కరెప్షన్ లో ప్రపంచ రికార్డు సృష్టించి గ్లోరిఫై చేసే స్థాయికి ఎదిగారు చంద్రబాబు.” అంటూ ట్వీట్ చేశారు.