కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వ దర్శనం’. తెలుగులో వచ్చిన చాలా క్లాసిక్స్ ని సృష్టించి.. తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప కళాకారుడు కె.విశ్వనాథ్. ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు.
ఈ రోజున విశ్వనాథ్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భం గా కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వ దర్శనం’ టీజర్ ను రిలీజ్ చేశారు. విశ్వనాథ్ గురించి పలువురు సినీ ప్రముఖుల దర్శకుడిగా విశ్వనాథ్ గొప్పతనం గురించి ప్రస్తావించారు. విశ్వనాథ్ సినిమాలకి భక్తితో వెళతారని ఎస్పీ అన్నారు. ఇక ‘సినిమా అనే ఓ బస్సును పట్టుకుని, సినిమా చూసేవారు ప్రేక్షకులు భక్తులు అనుకుని నేను బస్సు నడిపే డ్రైవర్‌ను. ఏం చేయాలి నేను?’ అంటూ చివర్లో విశ్వనాథ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.