పృథ్వీ నువ్వా ఇలా మాట్లాడింది.. నమ్మలేకపోతున్నా..ఫోన్ చేసి కనుక్కోవయ్యా

0
99

తనకంటూ ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. అందులో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. మెగా బ్రదర్ నాగబాబు. ఇన్నాళ్లు, బాలయ్య, చంద్రబాబు, జగన్‌లను ఏకిపారేసిన నాగబాబు.. తాజాగా కమెడియన్, వైకాపా నేత పృథ్వీపై పడ్డారు. మెగా హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి నాగబాబు ఇటీవల రూ.1.25 కోట్లను జనసేనకు విరాళంగా ఇచ్చాడు. ఇటీవల పృథ్వీ మాట్లాడుతూ.. పన్ను ఎగ్గొట్టేందుకే ఈ సొమ్మును విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. ఎక్కడి నుంచో తెచ్చిన సొమ్మును నాగబాబు తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేనకు విరాళంగా ఇచ్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పృథ్వీ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన నాగబాబు.. అతడలా అన్నాడంటే నమ్మలేకుండా ఉన్నానని, ఒకవేళ అని ఉంటే మాత్రం వ్యక్తిగతంగా కలిసి మరీ సమాధానం చెబుతానని హెచ్చరించాడు. పృథ్వీ దగ్గర తన ఫోన్ నంబరు ఉందని, అతడికేమైనా అనుమానాలుంటే తనకు నేరుగా ఫోన్ చేసి అడగొచ్చని సూచించాడు. జనసేనకు తామిచ్చిన విరాళం అధికారికమేనని నాగబాబు స్పష్టం చేశాడు.