మామా.. జగన్‌ గారిని ఎందుకు కలిశారు.. జూనియర్ ఎన్టీఆర్..

0
35

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు.. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో జగన్‌తో ఆయన భేటీ కావడం సంచలనం రేపుతోంది. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు.. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో జగన్‌తో ఆయన భేటీ కావడం సంచలనం రేపుతోంది.

నార్నె మాత్రం జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయనను కలిశాను తప్ప వేరే చర్చలేమీ జరగలేదని చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ నార్నె శ్రీనివాసరావు, జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగినా అలా జరగలేదు. మరి ఈ భేటీ ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందో వేచి చూడాలి.

మహానటుడు నందమూరి తారక రామరావు ఫ్యామిలీ నుంచి వచ్చిన నట వారసుడిగా… ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం కూడా చేసి.. రాజకీయాల్లోనూ తన సత్తా చూపించాడు.

ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ రైటర్.. మొదట్నుంచీ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకే మద్దతు ప్రకటించారు. అయితే, కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారమై… జూనియర్ ఎన్టీఆర్ పిల్లనిచ్చిన మామగారిని కలిశారని.. జగన్‌తో ఎందుకు భేటీ అయ్యారని అడిగారని సన్నిహిత వర్గాల సమాచారం.