పరగడపన నీళ్ళు ఎందుకు తాగాలి?

0
52

చాలా మంది పరగడపన చెంబుడు నీళ్లు తాగుతుంటారు. కొంతమంది అయితే, గోరువెచ్చని నీటిని తాగుతారు. ఇలా పరగడపన నీళ్లు సేవించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

* నిద్రలేవగానే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది.

* పరిగడపన నీళ్లు తాగటం వల్ల శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి.

* పెద్ద పేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.

* రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఎంతగానో దోహదపడుతుంది.

* కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం.

* శరీర బరువు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

* చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది.

* అన్నిటికంటే ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

* ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.