ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర కారు ప్రమాదం

0
49

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చాలా దారుణమైన ప్రమాదం జరిగింది. సంగారెడ్డి సమీపంలోని అమీన్‌పూర్ రింగ్ రోడ్డుపై ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. మేడ్చల్ నుంచి పఠాన్ చెరువు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదం లో ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారులో ఉన్న మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సమాచారం అందుకున్నవెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.