మావారు మొరటు.. రోజూ కొత్త ప్రయోగం అంటారు.. ఏం చేయాలి?

0
71

ప్ర: మాది విజయవాడ. వివాహమై యేడాది అయింది. పిల్లలు ఇపుడే వద్దనుకున్నాం. వృత్తిరీత్యా బెంగుళూరులో నివశిస్తున్నాం. మాకిద్దరికీ శృంగారం అంటే మహాపిచ్చి. అయితే, పని ఒత్తిడి కారణంగా నేను పెద్దగా ఆసక్తి చూపించలేకపోతున్నా. కానీ, ఆయన మాత్రం పదేపదే కావాలంటున్నారు. దీనికితోడు పడక గదిలో ఆయన కాస్త మొరటుగా ప్రవర్తిస్తారు. రోజుకో భంగిమలో కొత్త ప్రయోగం చేస్తానంటూ మారాం చేస్తుంటారు. అలాంటపుడు నేను అభ్యంతరం చెబితే ఏమైనా విసుక్కుంటారు. ఈ పరిస్థిని ఎలా డీల్ చేయాలి. ???

జ: ఎంత బిజీగా ఉన్నా… పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ పడక గదికంటూ కొంత సమయం కేటాయించడం మంచిది. లేనిపక్షంలో భార్యాభర్తల మధ్య విభేదాలు పొడచూపే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయంలో మహిళలే చొరవు తీసుకోవాలి. పడక గదికోసం కొన్ని గంటలు లేదా రోజులు సర్దుబాటు చేసుకుని మీ వారికి సహకరించాలి.

Unhappy Couple in Bed

ఇకపోతే, పడక గదిలో భర్త మొరటు ప్రవర్తన ఏమాత్రం అసౌకర్యం కలిగించినా ఆ విషయాన్ని సున్నితంగా తెలియజేయవచ్చు. పైగా, శారీరకంగా కలవడం అనేది భార్యాభర్తల ఇష్టాయిష్టాలపై ఆధారపడివుంటుంది. అలాగే మీకు నొప్పి కలగని శృంగార భంగిమ గురించి ఆయనకు తెలియజేయండి. అలా ఇద్దరు ఒకరికొకరు కంఫర్టబుల్‌గా తయారయ్యాక నెమ్మదిగా వేర్వేరు శృంగార పొజిషన్స్‌లో ప్రయోగాల గురించి ఓపెన్‌గా డిస్కస్‌ చేసుకోండి. ఇలాంటి సెన్సిటివ్‌ విషయాలను ఓపెన్‌గా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా శృంగార నిపుణులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.