మేం చేతగాని దద్దమ్మలం కాదు.. ఇమ్రాన్‌కు అఫ్రిది మద్దతు

0
36

పుల్వామా ఉగ్రదాడి తర్వాత తమపై భారత్ దాడి చేస్తే తాము గాజులు తొడుక్కుని కూర్చోవడానికి చేతగాని దద్దమ్మలం కాదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిద్ అన్నారు. పుల్వామా దాడిని అడ్డుపెట్టుని భారత్ తమపై దాడి చేస్తే తాము ప్రతిదాడి చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించిన విషయం తెల్సిందే.

దేశ ప్రధాని హోదాలో మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సమర్థించగా, ఇపుడు షాహిద్ అఫ్రిది కూడా అండగా నిలిచారు. “ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు” చర్యకు ప్రతిచర్య తప్పదన్నారు. పైగా, తాము చేతగాని దద్దమ్మలం కాబోమంటూ ఆయన చేసిన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ‘ఇండియా ప్రతీకార దాడికి దిగుతుందని అనుకోవడం లేదు.. ఒకవేళ దిగితే కనుక తగిన బుద్ధి చెబుతాం. మీరు దాడి చేస్తే మేం చేతులు ముడుచుకుని కూర్చుంటామని మీరు(భారత్) భావిస్తుండొచ్చు. కానీ అది తప్పు. మేం కూడా సరైన సమాధానం చెబుతాం’ అని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.