చేపలతో వృద్ధాప్య వ్యాధులకు చెక్ !!

0
37

సాధారణంగా వృద్ధాప్యంలో వివిధ రకాల వ్యాధుల బారినపడుతుంటారు. ప్రధానంగా వేధించే వ్యాధులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, నొప్పులు, వాపులు. ఇవి చాలా మందికి దీర్ఘకాలికంగా ఉంటాయి. ఇలాంటి వారు కేవలం మందులపైనే ఆధారపడకుండా, ప్రత్యామ్యాయ మార్పులు కూడా చేసుకోవాలి.

ముఖ్యంగా, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు. ఇటీవల వృద్ధుల్లో గుండె పనితీరును పరీక్షించేందుకు 60 నుంచి 75 యేళ్ళున్న రెండు వేల మంది వృద్ధులను పరీక్షించారు.

వీరిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉన్నాయో అలాంటి వారు ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. అలాగే, దీనికి కారణం.. వారు తీసుకున్న ఆహారంలో సింహ భాగం చేపలు ఉండటమే కారణమని వెల్లడించారు. అందువల్ల వృద్ధుల్లో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలంటే తరచుగా లేదా వారంలో మూడు రోజులు చేపలను ఓ కూరగా చేసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. పైగా, ఎలాంటి వయసులోనైనా అత్యంత సులభంగా జీర్ణమయ్యే ఆహారం చేపలు. మరి పెద్దలూ.. ఇంకెందుకు ఆలస్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే వృద్ధాప్యంలో చేపలు ఆరగించేందుకే మొగ్గుచూపండి.