భారత్‌కు ముషారఫ్ వార్నింగ్… పాక్‌ను ఇండియన్ ఆర్మీ టచ్ కూడా చేయలేదట..

0
66

భారత్‌కు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశాన్ని ఇండియన్ ఆర్మీ టచ్ కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా, ఐదు అంశాల్లో భారత్ – పాకిస్థాన్‌‌లకు ఏమాత్రం పొంతన లేదన్నారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పర్వేజ్ ముషారఫ్ స్పందిస్తూ, పాకిస్థాన్‌లోని ఐదు పాయింట్లలో నాలుగు పాయింట్లలోని తమ సైన్యాన్ని భారత దళాలు టచ్ కూడా చేయలేవన్నారు.

పుల్వామా దాడిని తాను ఖండిస్తున్నానని చెబుతూ, దాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందంటూ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. దాడి జరిగిన మరుసటి రోజే పాక్‌ను భారత్ తప్పుబట్టడం సరికాదని, ఘటన జరిగిన గంటల్లోనే అసలెలా తప్పుబడతారని ప్రశ్నించారు.

పుల్వామా దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే ఉగ్రవాద సంస్థను పాక్ ఉపేక్షించదన్నారు. జైషేపై నిషేధం విధించాలని, ఆ సంస్థ చీఫ్ మసూద్‌పై తమకేమాత్రం సానుభూతి లేదని ముషారఫ్ స్పష్టం చేశారు. పుల్వామా దాడిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ హస్తం లేదని ఆయన వెల్లడించారు.

అగ్రదేశం అమెరికాతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చిన ముషారఫ్.. పాక్‌ కూడా ఉగ్రవాద బాధిత దేశమని ప్రపంచం గుర్తించాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎలా అణచివేయాలో తమకు తెలుసని, వేరేవాళ్ల జోక్యం అనవసరమని ముషారఫ్ భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్‌కు అమెరికా దన్నుగా నిలుస్తుందనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తాము అమెరికాకు అండగా నిలిచామని, అది మరువకూడదన్నారు.Prime Minister Imran Khan