కేసీఆర్ పాలసీ.. యూజ్ అండ్ త్రో : హరీష్‌పై రాములమ్మ సానుభూతి

0
44

తెరాస అధినేత కేసీఆర్‌పై సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత రాములమ్మ మరోమారు విమర్శలు గుప్పించారు. యూ అండ్ త్రో పాలసీ కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలంకగా వ్యవహరించిన సీనియర్ నేత హరీష్ రావుకు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించక పోవడంపై విజయశాంతి స్పందించారు.

కేసీఆర్ నైజమే అంతన్న విజయశాంతి.. దొరల వారసత్వ పాలనలో తీరు ఎప్పటికీ మారదన్నారు. నాడు, నేడు, రేపు.. ఎప్పడైనా ఇలానే ఉంటుందన్నారు. తెరాసలో రెండో స్థానంలో ఉన్న వారి పరిస్థితి ఎప్పటికీ ఇంతేనని, మొన్న ఆలె నరేంద్ర, నిన్న తాను, నేడు హరీశ్ రావు అని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన వారిని తడిగుడ్డతో గొంతు కోయడం టీఆర్ఎస్ నాయకత్వ నైజమన్న విషయం మరోమారు రుజువైందని విజయశాంతి విమర్శించారు.