కోడి రామకృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

0
140

ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నఆయన..హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపధ్యం లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు.

” ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి తీవ్ర విచారకరం. ఎన్నో విజయవంతమైన గ్రామీణ ప్రాంత నేపధ్యంతో కూడిన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు, తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితో సినిమాలు రూపొందించిన ఘనత సాధించిన ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.” అంటూ అంటూ స్పందించారు..