వడ పప్పుకూర తయారీ ఎలా ?

0
247

కావాల్సినవి:

పెసర పప్పు.. అరకిలో
పచ్చికొబ్బరి.. తురుము 1 కప్పు
ఆవాలు.. పావు టీస్పూను
జీలకర.. పావు టీస్పూను
పచ్చిమిర్చి.. మూడు
ఎండుమిర్చి.. మూడు
వెల్లులి.. నాలుగు రెబ్బలు
నూనె.. తగినంతగా
కరివేపాకు.. రెండు రెబ్బలు
పసుపు.. చిటికెడు
ఉప్పు.. తగినంత

తయారీ విధానం.. ముందుగా పెసర పప్పు రెండు గంటలు నానబట్టి అందులో నీళ్లు వంపేసి ఉంచాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిదిమిన వెల్లులి వేసి బాగా కాగనివ్వాలి. అందులో ముందుగా నానపెట్టిన పెసరపప్పును వేసి మూత పట్టి కాసేపు సన్నని మంటమీద ఉడికించాలి. పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత ఓ సారి బాగా కలిపి అందులో పసుపు, పచ్చిమర్చి, కరివేపాకు, ఉప్పు, వేసి మరో రెండు నిమిషాలు బాగా ఉడికించాలి. చివరగా కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన వడపప్పు కూర మీకు సిద్ధమైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే ఆ టేస్టే వేరులే.